JN: తరిగొప్పుల మండల కేంద్రానికి చెందిన తాళ్లపల్లి రవి(40) మద్యానికి బానిసై బలవన్మరణానికి పాల్పడ్డాడు. మద్యం తాగిన రవిని కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నాడు. తండ్రి పోచయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై శ్రీదేవి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తెలంగాణ
మద్యానికి బానిసై బలవన్మరణం


