తిరుపతి నగరపాలక సంస్థను 50 నుంచి 66 వార్డులకు పెంచుతూ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వార్డుల పునర్విభజనపై ఈ నెల 11 వరకు అభ్యంతరాలను స్వీకరించారు. పూర్తి చేసిన వార్డుల విభజన ప్రక్రియను మున్సిపల్ శాఖకు పంపించారు. ప్రభుత్వ పరిశీలన అనంతరం మంగళవారం సాయంత్రం వార్డుల పెంపునకు ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని నగరపాలక సంస్థ కమిషనర్ ఎం.జయకృష్ణ వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
66 వార్డులుగా తిరుపతి నగరపాలక సంస్థ


