NTR: జి.కొండూరు మండలం గంగినేనిపాలెంలో రూ.36 లక్షలతో నిర్మించిన గ్రామీణ ఆరోగ్య కేంద్రాన్ని MLA వసంత వెంకట కృష్ణప్రసాద్ మంగళవారం ప్రారంభించారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఆయన అన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గంగినేనిపాలెంలో ఆరోగ్య కేంద్రం ప్రారంభం


