హైదరాబాద్: 28°C
తెలంగాణ

మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య

KNR: చొప్పదండి మండలం అర్నకొండకు చెందిన గంగాధర నాగరాజు(33) అనే వ్యక్తి మద్యానికి బానిసై ఆత్మహత్య చేసుకున్నాడు. కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న నాగరాజుకు గతంలో రెండు వివాహాలు జరిగి విడాకులు అయ్యాయి. దీంతో మనోవేదనకు గురై మద్యానికి బానిసైనట్లు పోలీసులు తెలిపారు. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని మృతి చెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.