హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ ఆర్గనైజింగ్ సెక్రటరీని సత్కరించిన MLA

PPM: జిల్లా మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ నూతన ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా ఎంపికైన గేదెల సత్యభగవాన్‌ను మంగళవారం కురుపాం MLA జగదీశ్వరి ఆమె క్యాంపు కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి అభినందించారు. మారుమూల ప్రాంతాల్లోని క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.