హైదరాబాద్: 28°C
తెలంగాణ

మత్తడి దూకుతున్న ఎగువ మానేరు

SRCL: గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు జలాశయం రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మత్తడి దూకుతోంది. కామారెడ్డి జిల్లా పల్వంచ వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో మంగళవారం ఉదయం నుంచి జలాశయానికి భారీగా వరద చేరుతోంది. గంభీరావుపేట-లింగన్నపేట మధ్య మట్టి రోడ్డును గుత్తేదారు తొలగించడంతో రాకపోకలకు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.