హైదరాబాద్: 28°C
తెలంగాణ

అధికారుల గైర్హాజరుతో ప్రజలకు ఇబ్బందులు!

SRPT: ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంలోని ఉపాధి హామీ (వీబీజీ రామ్ జీ) కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో అధికారులు, సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో పనులపై వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికైనా పైస్థాయి అధికారులు స్పందించి సమయపాలన పాటించని సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.