హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆళ్ల నాని మృతిపై విడదల రజిని సంతాపం

PLD: మాజీ ఉప ముఖ్యమంత్రి, ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (ఆళ్ల నాని) ఆకస్మిక మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని మాజీ మంత్రి విడదల రజిని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని కోరారు.