హైదరాబాద్: 28°C
తెలంగాణ

అవగాహనతోనే నేరాల నివారణ: పోలీసులు

గద్వాల మండలం రేవులపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు భద్రత, సైబర్‌ నేరాలు, డ్రగ్స్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రమాదాల నివారణకు హెల్మెట్‌ ధరించాలని సూచించారు. సైబర్‌ మోసాలకు 1930, అత్యవసరాలకు 112, ఈవ్‌టీజింగ్‌పై షీ టీమ్‌ 8712670312కు సమాచారం ఇవ్వాలన్నారు. ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు.