హైదరాబాద్: 28°C
తెలంగాణ

నడుము నొప్పి తాళలేక వృద్ధురాలి ఆత్మహత్య

గద్వాల: మానవపాడుకు చెందిన గోవిందమ్మ (86) తీవ్రమైన నడుము, మోకాళ్ల నొప్పులు భరించలేక పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై బి.స్వాతి తెలిపారు. ఈ నెల 14న సాయంత్రం ఇంట్లో పురుగుమందు తాగిన ఆమెను కుటుంబసభ్యులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారన్నారు. చికిత్స పొందుతూ మంగళవారం గోవిందమ్మ మృతి చెందిందని ఎస్సై తెలిపారు.