AKP: దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో 69వ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ మంగళవారం ప్రారంభమైంది. కార్యక్రమంలో ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు. పార్లమెంటరీ విధానాలు, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ, దేశాల మధ్య సహకారంపై చర్చలు జరిగాయి. ఏపీ నుంచి శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషేను రాజు, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి తదితరులు హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్
'కేప్‌టౌన్‌లో కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సు'


