సిద్దిపేట: అవాంఛనీయ సంఘటనల నివారణకు అహ్మద్‌నగర్‌లో దౌల్తాబాద్ ఎస్సై అరుణ్‌కుమార్ ఆధ్వర్యంలో డాగ్ స్క్వాడ్‌తో పోలీసులు తనిఖీలు చేపట్టారు. గ్రామంలోని బస్టాండ్, వీధులు, దుకాణాల పరిసరాలను తనిఖీ చేశారు. శాంతిభద్రతల పరిరక్షణకే ఈ సోదాలని ఎస్సై తెలిపారు. గ్రామంలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.
తెలంగాణ
అహ్మద్‌నగర్‌లో పోలీసుల ముమ్మర సోదాలు


