హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 108 సెల్‌ఫోన్లతో వినాయకుడి విగ్రహం

JGL: కోరుట్ల పట్టణంలోని ఫిల్టర్ బెడ్ వద్ద ఏర్పాటు చేసిన సెల్‌ఫోన్ల వినాయకుడు భక్తులను ఆకట్టుకుంటున్నాడు. గజముఖ్ యూత్ సభ్యులు పనికిరాని 108 పాత సెల్‌ఫోన్లను ఉపయోగించి 5 అడుగుల ఎత్తులో వినాయకుడి విగ్రహాన్ని రూపొందించారు. గణేషుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుండగా.. ప్రస్తుతం ఈ గణేషుడి విగ్రహం భక్తులు, చూపరులను ఆకర్షిస్తుంది. పలువురు ఈ ఆలోచనను ప్రశంసిస్తున్నారు.