NLG: గుండ్లపల్లి మండలం ములాతండా గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో పడి నాగమణి (21) నిన్న సాయంత్రం మృతి చెందింది. 18 నెలల క్రితం ఆంజనేయులుతో ప్రేమ వివాహం జరిగింది. అదనపు కట్నంగా భూమి, బంగారం, ప్లాట్, రూ.5 లక్షలు తీసుకురావాలని భర్త, అత్తమామలు వేధించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
వరకట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్య!


