ADB: ప్రీ ప్రైమరీ స్కూళ్లతో ప్రాథమిక విద్య బలోపేతం చెందుతుందని HM చిన్నయ్య పేర్కొన్నారు. మంగళవారం జైనథ్ మండలంలోని కరంజి గ్రామంలో ప్రీ ప్రైమరీ పాఠశాలను సర్పంచ్ శైలజతో కలిసి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న నాణ్యమైన విద్య, మెరుగైన వసతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాంప్లెక్స్ HM విజయ సారథి, గ్రామస్తులు పాల్గొన్నారు.
తెలంగాణ
'ప్రీ ప్రైమరీ స్కూళ్లతో ప్రాథమిక విద్య బలోపేతం'


