హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ సోషల్ మీడియా సెక్రటరీగా మొగల్ మడక వాసి

నారాయణపేట: టీపీసీసీ సోషల్‌ మీడియా కార్యదర్శిగా దామరగిద్ద మండలం మొగల్‌మడకకు చెందిన వీరేశ్ కుమార్‌ నియమితులయ్యారు. పార్టీకి చేస్తున్న సేవలను గుర్తించి అవకాశం కల్పించినట్లు ఆయన తెలిపారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్యే పర్ణికరెడ్డి, మాజీ డీసీసీ కుంభం శివకుమార్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మండల పార్టీ నాయకులు అభినందించారు.