హైదరాబాద్: 28°C
తెలంగాణ

'డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల డ్రాపై విచారణ చేయాలి'

JN: డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల డ్రాలో అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ లింగాల గణపురం మండలంలోని కళ్లెం గ్రామంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో నివసిస్తున్న లబ్ధిదారులు డిప్యూటీ తహసీల్దార్ ఎండీ షాకీర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆస్తులు ఉన్న వారికి కూడా ఇళ్లు కేటాయించారని, దీనిపై విచారణ జరిపి అర్హులైన పేదలకు ఇళ్లు కేటాయించాలని కోరారు.