హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాఠశాలల్లో ఎన్నికలకు నోటిఫికేషన్

CTR: ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ కమిటీ ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేశారని డీఈవో లక్ష్మీనారాయణ తెలిపారు. పాఠశాలల నోటీసు బోర్డులపై 18న ప్రాథమిక ఓటర్ల జాబితాను ప్రదర్శించనున్నారు. ఓటర్ల జాబితాపై ఏవైనా అభ్యంతరాలు, సవరణలు ఉంటే ఈ నెల 25వ తేదీ లోపు సంబంధిత పాఠశాలల హెచ్ఎంలకు తెలియజేయాలన్నారు. ఈనెల 29న పోలింగ్ జరుగుతుందన్నారు.