హైదరాబాద్: 28°C
క్రీడలు

జింబాబ్వే యువ పేసర్ సంచలనం

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో జింబాబ్వే యువ పేసర్ న్యూమన్ న్యామ్‌హురి ఐదు వికెట్లతో సంచలనం సృష్టించాడు. ఆసీస్‌పై వన్డేల్లో ఐదు వికెట్లు తీసిన తొలి జింబాబ్వే పేసర్‌గా రికార్డుకెక్కాడు. అలాగే, 20 ఏళ్ల 239 రోజుల వయసులోనే ఈ ఘనత సాధించి, వన్డేల్లో ఈ మైలురాయిని అందుకున్న పిన్న వయస్కుడైన జింబాబ్వే బౌలర్‌గా నిలిచాడు.