హైదరాబాద్: 28°C
తెలంగాణ

కుట్టు మిషన్ పథకం గడువు పొడిగింపు: మంత్రి పొన్నం

సిద్దిపేట: ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకంకు దరఖాస్తుల స్వీకరణ గడువును సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. దరఖాస్తు చేసుకోని బీసీ మహిళలు TGOBMMS పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. 119 నియోజకవర్గాల్లో 1,000 చొప్పున మొత్తం 1.19 లక్షల మందికి ఆటోమేటిక్ కుట్టు మిషన్లను 100 శాతం సబ్సిడీపై అందించనున్నట్లు తెలిపారు.