హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజా సమస్యలపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఆరా

E.G: తాళ్లపూడి మండలంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర మంగళవారం పర్యటించారు. మండల బీజేపీ అధ్యక్షుడు ఇండుగుల రామకృష్ణ ఆధ్వర్యంలో తాడిపూడి, పోచవరం, తుపాకులగూడెం గ్రామాల్లో పర్యటించి ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాడిపూడిలో ప్రధాన రహదారి లోతట్టుగా ఉండటంతో వర్షాలు కురిసిన సమయంలో నీరు నిలిచిపోతున్న సమస్యను పరిష్కరిస్తానన్నారు.