హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పిఠాపురంలో పోలీసుల విస్తృత ఫుట్ పెట్రోలింగ్

KKD: పిఠాపురం పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు మంగళవారం సాయంత్రం పోలీసులు విస్తృతంగా ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. సీఐ శ్రీనివాస్, టౌన్ ఎస్సైల ఆధ్వర్యంలో పోలీసు, స్పెషల్ పార్టీ సిబ్బంది ఉప్పాడ రోడ్ సెంటర్, రైల్వే స్టేషన్, బస్టాండ్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులపై నిఘా పెట్టారు.