MDK: వెల్దుర్తి మండలం కుకునూర్ గ్రామంలో కంకర మిషన్ ఏర్పాటు చేయవద్దని గ్రామస్తులు డిమాండ్ చేశారు. సర్పంచ్ సాయిలు ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించి ఈ మేరకు తీర్మానం చేశారు. మంగళవారం MRO విజయలక్ష్మిని కలిసి వినతి పత్రం అందజేశారు. గతంలో కంకర మిషన్ ఏర్పాటు చేసేందుకు ఇచ్చిన అనుమతులన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
'కంకర మిషన్ ఏర్పాటు చేయవద్దు'


