WG: నరసాపురం 25వ వార్డులోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాలను ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ సందర్శించారు. విద్యార్థులతో ఆత్మీయంగా ముచ్చటించి, వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం పాఠశాల సిబ్బందితో మాట్లాడి విద్యా సౌకర్యాలు, పాఠశాల అవసరాలను తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే


