హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గొల్లప్రోలు మున్సిపాలిటీలో 20,846 మంది ఓటర్లు

KKD: గొల్లప్రోలు మున్సిపాలిటీలోని 23 వార్డులకు సంబంధించి మొత్తం 20,846 మంది ఓటర్లు ఉన్నట్లు కమిషనర్ దివిజ సంపతి తెలిపారు. వీరిలో 10,470 మంది మహిళలు, 10,376 మంది పురుషులు ఉన్నారు. సామాజిక వర్గాల వారీగా ఎస్టీలు 46, ఎస్సీలు 2,685, బీసీలు 4,339, ఇతరులు 13,776 మంది ఉన్నట్లు వెల్లడించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.