హైదరాబాద్: 28°C
తెలంగాణ

మల్కాజిగిరిలో 19 కిలోల గంజాయి పట్టివేత

MDCL: మల్కాజిగిరిలో రూ.10 లక్షల విలువైన 19 కిలోల గంజాయి పట్టుబడింది. ఒడిశా నుంచి రైలులో నగరానికి గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో చర్లపల్లి రైల్వే స్టేషన్‌ సమీపంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు తనిఖీలు చేపట్టారు. కొనుగోలుదారులకు గంజాయి అందించేందుకు వేచి ఉన్న నిందితుడు అధికారులు రావడం గమనించి గంజాయిని అక్కడే వదిలి పరారయ్యాడు.