హైదరాబాద్: 28°C
తెలంగాణ

వేలాడుతున్న హైమాస్ట్ లైట్..!

NRPT: నారాయణపేట పట్టణంలోని శ్రీ సాయి పబ్లిక్‌ స్కూల్‌ సమీప డివైడర్‌ పై హైమాస్ట్‌ లైట్‌ ప్రమాదకరంగా వేలాడుతోంది. వైరుపై భారం వేసి ఉన్న లైట్‌ ఎప్పుడు కిందపడుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు నిత్యం ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తుంటారు. ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించి లైట్‌ ను సరిచేయాలని కోరుతున్నారు.