హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళా సంఘాల బలోపేతానికి చర్యలు: సీతక్క

MLG: మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని మంత్రి సీతక్క అన్నారు. త్వరలో 31 జిల్లాల్లో 200 మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్లాంట్ల ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించామన్నారు. ప్లాంట్ల ద్వారా నెలకు రూ.5 లక్షల ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆడబిడ్డ ఇంటికే కాకుండా సమాజానికి వెలుగునిచ్చే శక్తిగా ఎదగాలని పిలుపునిచ్చారు.