హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వీఆర్ఏల డిమాండ్లు అమలు చేయాలని వినతిపత్రం

KKD: ప్రత్తిపాడు మండల వీఆర్ఏల సంఘం నాయకులు తమ న్యాయమైన డిమాండ్లను అమలు చేయాలని కోరుతూ తహసీల్దార్ ఎం. సూర్యప్రభకు మంగళవారం సమ్మె నోటీసు అందజేశారు. తెలంగాణ తరహాలో పే స్కేలు అమలు చేయాలని, నామినీ వీఆర్ఏలను వన్‌టైం సెటిల్‌మెంట్ ద్వారా రెగ్యులర్‌ చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన వీఆర్ఏలకు 70 శాతం పదోన్నతులు కల్పించాలని కోరారు.