హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఐ తీరుపై జర్నలిస్టుల నిరసన

KRNL: పత్తికొండ అర్బన్‌ సీఐ జయన్నను సస్పెండ్‌ చేయాలని జర్నలిస్టు జేఏసీ, ప్రజాసంఘాలు డిమాండ్‌ చేశారు. విలేకరి నాగరాజుపై సీఐ దురుసుగా ప్రవర్తించి, దుర్భాషలాడారని నాయకులు ఆరోపించారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి సీఐపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేసి, ఆర్డీవో ఓబులేసుకు వినతిపత్రం అందజేశారు.