హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నెల్లూరులో 516 కేజీల భారీ లడ్డూ

నెల్లూరులోని వేదాయపాలెం మోర్ సమీపంలో ఏర్పాటు చేసిన గణేశుడి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చేతిలో సరస్వతి దేవి వీణను పట్టుకుని ఉన్న రూపంలో గణనాథుడిని తీర్చిదిద్దారు. ఈ వేడుకలో 516 కిలోల భారీ లడ్డూను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం విశేషంగా నిలిచింది. గణేశుడి విగ్రహంతో పాటు భారీ లడ్డూను చూసేందుకు భక్తులు, స్థానికులు ఆసక్తిగా తరలివస్తున్నారు.