హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంగన్వాడీలో పోషణ మాసం కార్యక్రమం

WGL: తిమ్మరాయన్ పహడ్ అంగన్‌వాడీ థర్డ్ సెంటర్‌లో మంగళవారం పోషణ మాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ​కార్యక్రమనికి ICDS సూపర్‌వైజర్ రాధ, సర్పంచ్ రమేష్ హాజరై మాట్లాడుతూ.. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు, దాని ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. టీచర్ అరుణ, రాజ్యం, ఆయాలు, స్థానిక బాలింతలు పాల్గొన్నారు.