హైదరాబాద్: 28°C
తెలంగాణ

పంట రక్షణ విద్యుత్ తీగ తగిలి లారీ క్లీనర్ మృతి

ADB: నేరడిగొండ మండలంలో మొక్కజొన్న పంటకు అక్రమంగా ఏర్పాటు చేసిన విద్యుత్ తీగ తగిలి లారీ క్లీనర్ రూపేష్ కుమార్ మృతి చెందినట్లు CI రమేష్ మంగళవారం తెలిపారు. పంట రక్షణ పేరుతో అక్రమ విద్యుత్ తీగలు ఏర్పాటు చేసిన చంద్రబాన్‌పై హత్య నేరం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. విద్యుత్ తీగలు ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.