MDK: చేగుంట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి రికార్డులు, మెడికల్ స్టోర్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నెలలు నిండుతున్న గర్భిణీలు, ముఖ్యంగా హైరిస్క్ కేసులపై ప్రత్యేక శ్రద్ధ వహించి జిల్లా ఆసుపత్రి ద్వారా మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
తెలంగాణ
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కలెక్టర్ తనిఖీలు


