హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్కానింగ్ సెంటర్లలో ఆకస్మిక తనిఖీలు

మహబూబాబాద్ పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లలో DMHO డా. రవి రాథోడ్ ఆధ్వర్యంలో వైద్య బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా ఆసుపత్రుల్లో రికార్డులను పరిశీలించారు. అనంతరం DMHO మాట్లాడుతూ.. లింగ నిర్ధారణ చేయడం, చేయించడం, ప్రోత్సహించడం చట్టరీత్యా నేరమని తెలిపారు. రికార్డులను సక్రమంగా నిర్వహించాలని, నిబంధనలు ఉల్లంఘింస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.