VKB: బంట్వారం మండల కేంద్రంలోని 2వ వార్డులో సరైన మురుగు కాలువలు లేకపోవడంతో వాడిన నీరు ఎక్కడికక్కడే నిలిచిపోతోంది. దీంతో పరిసరాల్లో దుర్వాసన వెదజల్లడంతో పాటు దోమల బెడద పెరుగుతోందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి మురుగు కాలువలు ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.
తెలంగాణ
నిలిచిన మురుగు నీరు.. దోమల బెడద


