హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అమలాపురం ఏపీపీగా నందిక శ్రీనివాస్

కోనసీమ: అమలాపురంలోని పలు కోర్టులకు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్(ఏపీపీ)గా సీనియర్ న్యాయవాది నందిక శ్రీనివాస్‌ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు న్యాయశాఖ జి.ఓ.ఆర్.టీ. నం.261 ఉత్తర్వులు జారీ చేసింది. 3 ఏళ్ల పాటు ప్రభుత్వం తరపున సివిల్ కేసుల్లో ఆయన వాదనలు వినపించనున్నారు. నియామకంపై పలువురు న్యాయవాదులు హర్షం వ్యక్తం చేసి శ్రీనివాస్‌కు శుభాకాంక్షలు తెలిపారు.