హైదరాబాద్: 28°C
తెలంగాణ

NTPCలో భద్రతా మాక్‌ డ్రిల్‌

MDCL: ఘన్‌పూర్‌ NTPC వద్ద మంగళవారం భద్రతా మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. కీలక సంస్థలపై తలెత్తే అనూహ్య ముప్పులను సమర్థంగా ఎదుర్కొనేందుకు భద్రతా సిబ్బంది సంసిద్ధతను పరీక్షించారు. సంస్థ పరిసరాలను క్షుణ్నంగా తనిఖీ చేసి భద్రతా ఏర్పాట్లు, అత్యవసర స్పందన వ్యవస్థలను సమీక్షించారు. విపత్కర పరిస్థితుల్లో సమన్వయంతో వేగంగా స్పందించే సామర్థ్యాన్ని పరిశీలించారు.