హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీసులకు రెయిన్‌కోట్స్ పంపిణీ

WNP: జిల్లా పోలీసు సిబ్బందికి వర్షాకాలంలో విధి నిర్వహణలో ఇబ్బందులు కలగకుండా ఎస్పీ సునిత రెడ్డి మంగళవారం రెయిన్‌కోట్స్ అందజేశారు. ఈ సందర్భంగా పోలీసుల సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని ఎస్పీ తెలిపారు. ఎండైనా, వానైనా ప్రజల భద్రత కోసం విధులు నిర్వహిస్తున్న పోలీసులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు.