హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రోమోర్ సెంటర్‌లో తనిఖీలు

WGL: నల్లబెల్లి మండలంలోని గ్రోమోర్ సెంటర్‌లో MOP ఎరువుల బస్తాలను మండల వ్యవసాయ అధికారి బన్న రజిత తనిఖీ చేశారు. అనుమానం ఉన్న బస్తాల నుంచి నమూనాలు సేకరించి పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారు. ల్యాబ్ ఫలితాలు వచ్చిన అనంతరం తదుపరి విచారణ చేపట్టి నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని ఏవో తెలిపారు.