హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎంజేపీ పాఠశాలలో బదిలీ ప్రక్రియ పూర్తి: RCO

WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకులాల్లో 5వ నుంచి 9వ తరగతి వరకు బదిలీకి దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల బదిలీ ప్రక్రియ పారదర్శకంగా పూర్తయిందని RCO శ్రవణ్ కుమార్ తెలిపారు. బదిలీ పొందిన పాఠశాలల నుంచి ఫోన్ రాగానే విద్యార్థులు వెంటనే రిపోర్టు చేయాలని సూచించారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరు బదిలీ కోసం RCO ఆఫీసుకు రావద్దని ఆయన అన్నారు.