హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూత్పూర్ అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలి:GMR

MBNR: భూత్పూర్ మున్సిపల్ కార్యాలయంలో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (GMR) పాల్గొన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధి, ప్రజా సమస్యలపై కౌన్సిలర్లు, అధికారులతో చర్చించారు. విద్యుత్, డ్రైనేజీ, తాగునీరు, పారిశుధ్యం, రోడ్ల సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. నూతన మున్సిపల్ కార్యాలయాన్ని ఏడాదిలో పూర్తి చేస్తామని తెలిపారు.