హైదరాబాద్: 28°C
తెలంగాణ

చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

MDK: కొల్చారం మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన చాకలి బిక్షపతి (40) మంజీరా నదిలో చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందాడు. సోమవారం సాయంత్రం నదికి వెళ్లిన ఆయన గల్లంతు కాగా, అగ్నిమాపక సిబ్బంది మంగళవారం గాలింపు చేపట్టి మృతదేహాన్ని వెలికితీశారు. భార్య నాగమణి ఫిర్యాదు మేరకు ఎస్సై మహమ్మద్ మోహినుద్దీన్ కేసు నమోదు చేశారు.