హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రభుత్వ భూమిలో మట్టి తవ్వకాలు'

RR: పుట్టవానిగూడ పరిధిలోని సంగెం శివారులో సర్వే నంబర్‌ 206లో ఉన్న 8.20 ఎకరాల ప్రభుత్వ భూమిలో మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని గ్రామస్థులు ఆరోపించారు. తవ్వకాలు, మట్టి తరలింపులు వెంటనే నిలిపివేసి ప్రకృతి వనాన్ని పరిరక్షించాలని కోరుతూ మంగళవారం తహశీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. ఎలాంటి అనుమతులు ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు.