హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కలెక్టర్‌ను అడ్డుకున్న న్యూడెమోక్రసీ

BDK: దుమ్ముగూడెం మండలం లక్ష్మీనగరంలో ఓవర్‌లోడ్ ఇసుక లారీ ఢీకొని మద్ది రాము మృతి చెందిన ఘటనపై సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కలెక్టర్‌ను అడ్డుకుని రాస్తారోకో నిర్వహించారు. మృతుడి కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని, భద్రాచలం-వెంకటాపురం వరకు రహదారులు నిర్మించే వరకు ఇసుక లారీలను నిలిపివేయాలని రోడ్డుపై బైటాయించి డిమాండ్ చేశారు.