హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాద మృతుడికి నివాళి

NLG:చండూరు మండలం కస్తాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శివరాత్రి వెంకటేశం రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమని డీసీసీ అధ్యక్షులు పున్న కైలాష్ నేత అన్నారు. విషయం తెలుసుకొని ఆయన మంగళవారం గ్రామానికి విచ్చేశారు. భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలిపారు.