PDPL: రామగుండం కార్పొరేషన్ పరిధిలో మంచినీటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు. మంగళవారం 38వ డివిజన్‌లో నూతన కుళాయిలను ప్రారంభించారు. ప్రతి డివిజన్‌లో ప్రజల అవసరాల మేరకు రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి పైప్‌లైన్ల అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రాము పాల్గొన్నారు.
తెలంగాణ
మంచినీటి కొరత లేకుండా చర్యలు: MLA


