హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాకాల పార్కులో సెల్ ఫోన్ సిగ్నల్ కష్టాలు

WGL: ఖనాపురంలోని పాకాల బయోడైవర్సిటీ పార్కును సందర్శించే పర్యాటకులు సెల్‌ఫోన్  సిగ్నల్ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పార్కును ఆనుకుని ఉన్న చిలకమ్మనగర్‌లో జనాభా ఉన్నా మొబైల్ టవర్ సౌకర్యం లేదు. అత్యవసర సమయాల్లో అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వాలన్నా ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు వాపోయారు. టవర్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.