VKB: బంట్వారం మండల కేంద్రంలోని కట్టెల మిషన్ నుంచి ప్రధాన రహదారి వరకు ఉన్న రోడ్డు అధ్వానంగా మారింది. చిన్నపాటి వర్షానికే రోడ్డుపై నీరు నిలిచి బురదమయంగా మారుతోంది. దీంతో పొలాలకు వెళ్లే రైతులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబంధిత అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
రోడ్డు దుస్థితితో రైతులకు తీవ్ర ఇబ్బందులు


