హైదరాబాద్: 28°C
తెలంగాణ

పూల వ్యర్థాల రీసైక్లింగ్‌కు శ్రీకారం

RR: గణేష్‌ నిమజ్జనం తర్వాత మిగిలే పూల వ్యర్థాలను రీసైకిల్‌ చేసేందుకు సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పక్కా ఆర్గానిక్స్‌తో సమావేశమైంది. ఐడీఎల్‌ చెరువు వద్ద ప్రత్యేక కియోస్క్‌ల ద్వారా పూలను సేకరించి ధూప్‌స్టిక్స్‌, ప్రమిదలుగా మార్చనున్నారు. కార్యక్రమాన్ని విస్తరించేందుకు స్వచ్ఛంద సంస్థలు, స్టార్టప్‌లను ఆహ్వానిస్తోంది.